APLatestNews.com top Banner
         
వేమన ఆత్మ జ్ఞాన సంపద 1 - బాహ్యమందు శివుని భావింప నిలుచునా - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
వేమన గారి తెలుగు పద్యం, దాని భావం కూడా ఉంది, ఆస్వాదించండి. ఇంతకన్నా వేద అర్థం, గీతాసారం, ఆధ్యాత్మిక మార్గం ఏమి కావాలి స్పందించే మనసు కు?

వేమన గారి , ఆ పది పద్యాల అర్థం మనసు కు పడితే, మీ ఇంట్లో వాళ్ళకో , స్నేహితులు కో వివరించ గలిగితే, మీకు భగవద్గీత అర్థం అయినట్టే, చదివినట్టే.

సందేహాలు ఉంటే, తెలిసిన వారిని, అడగడం మరువద్దు. గుడి , పూజ , అర్చన , జపం , ధ్యానం, తపము వరుస మెట్లు, మనసు ను సాధనతో అదుపు చేసి దైవం వైపు మరలించడానికి.

1.అంతరంగమందు అభవు నుద్దేశించి
నిలిపి చూడచూడ నిలుచుగాక
బాహ్యమందు శివుని భావింప నిలుచునా
విశ్వదాభిరామ వినుర వేమ

భావం - పరమాత్మను హ్రుదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది. బాహ్యంలో చూస్తే గురి కుదరదు. ఫలితం శూన్యం.

2. అడవి దిరుగ జిక్క దాకసమునలేదు
అవని తీర్ధయాత్రలందు లేదు
ఒడలు శుధ్ధిచేసి ఒడయని చూడరా
విశ్వదాభిరామ వినుర వేమ

భావం - అడవిలో తిరిగినా, ఆకాశంలో చూచినా, తీర్ధయాత్రలు చెసినా శివుడు దొరకడు. శరీరాన్ని మనస్సును శుద్ధిచేసి అందులోనే పరమాత్మను చూడాలి.

3. అదిమి మనసు నిలిపి ఆనందకేళిలో
బ్రహ్మమయుడు ముక్తి బడయగోరు
జిహ్వరుచులచేత జీవుండు చెడునయా
విశ్వదాభిరామ వినుర వేమ

భావం - మనస్సును నిలకడగా నిలిపి ఆనందపరవశుదై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేక పోవడం వలన మనిషి చెడిపోతాడు.

4. అల్పసుఖము లెల్ల నాశించి మనుజుండు,
బహుళదుఖములను బాధపడును
పరసుఖంబు నొంది బ్రతుకంగ నేరడు,
విశ్వదాభిరామ వినుర వేమ

భావం - ఐహిక(ఈ లోక) సంబంధమైన అల్పసుఖాలకు ఆశపడడంవల్ల అవి దుఖాన్ని కలుగచేస్తాయి; బాధనుండి విముక్తిని కలుగచేయలేవు. పరసుఖాన్ని ఆశించడంవల్ల బంధ విముక్తుడవుతాడు. ఇది జీవిత పరమార్ధమని తెలుసుకోలేక పోతున్నాడు.

5. ఆత్మశుద్ధి లేని యాచారమదియేల,
భాండశుద్ది లేని పాకమేల
చిత్త శుద్ది లేని శివపూజలేలరా,
విశ్వదాభిరామ వినురవేమ.

భావం - మనసును శుద్ది చేసుకొని నిర్మలంగా లేకుండా(చెడు అలోచనలు/పనులు) చేసే ఆచారం ఎందులకు? వంట పాత్ర శుభ్రంగా లేని వంట ఎందులకు? దైవ ద్యాస లేని, నిర్మలమైన మనసు లేని చేసే శివ పూజ ఎందులకు? ఫలితం శూన్యం.

6. హృదయమందు నున్న ఈశుని దెలియక,
శిలల కెల్ల మ్రొక్కు జీవులార!
శిలలనేమి యుండు జీవులందే కాక?
విశ్వదాభిరామ వినురవేమ

భావం - హృదయములో(తనలోనే) నున్న శివుని(పరమేశ్వరుని) దర్శించలేక(అంతరదృష్ఠి లేకుండా), జీవులందుoడే శివుని తెలుసుకోలేరు. రాళ్ళలో శివుడున్నాడని రాళ్లకు మొక్కే జీవులు నిజాన్ని కనలేరు.

7. వెన్న చేతబట్టి వివరంబు తెలియక,
ఘృతము కోరునట్టి యతని భండి
తాను దైవమయ్యు దైవంబు దలచును ,
విశ్వదాభిరామ వినురవేమ!

భావం - వెన్నను చేతలో పట్టుకుని నెయ్యి చేసే విధానము తెలియక నేతికై బాధపడే వానివలె, జనుడు తనలోనే భగవంతుడున్నాడని తెలుసుకోలేక అతనెక్కడో ఉన్నాడని వెదకుచూ తికమక పడుతుంటాడు.

8. రాతిబొమ్మ కేల రంగైనా వలువలు,
గుళ్ళు గోపురములు కుంభములును
కూడుగుడ్డ తాను గోరునా దైవంబు,
విశ్వదాభిరామ వినురవేమ

భావం - రాతి బొమ్మలకు వస్త్రాలు, గుడులు గోపురాలు నైవేద్యాలు అవసరం లేదు. కూడు, గుడ్డ దేవుడు కోరుకోడు. అవన్నీ మనం కల్పించినవే.

9. మర్మమెరుగ లేక మతముల గల్పిఒచి,
ఉర్వి దుఃఖులగుదు రొకరికొకరు
గాజు ఇంట కుక్క కలవళపడురీతి,
విశ్వదాభిరామ వినురవేమ

భావం - గాజు గదిలో దూరిన కుక్క బయట పడే మార్గం తెలియనట్లు దైవ రహస్యం తెలియక మతాలు కల్పించుకొని ఒకరికొకరు దుఃఖాలనుభవిస్తూ ఉన్నారు.

10. మాట లుడుగకున్న మంత్రంబు దొరకదు,
మంత్ర ముడుగకున్న మనసు నిలదు
మనసు నిల్వకున్న మరి ముక్తి లేదయా,
విశ్వదాభిరామ వినురవేమా !

భావం - మౌనంగా ఉంటేనే మంత్రం దొరకుతుంది. ఆ మంత్రం ఉడిగితే మనసు కుదురుతుంది. మనసు నిర్మలం గా లేనిదే ముక్తి లభించదు.

Dt : 30-Sep-2017, Upd Dt : 09-Aug-2019 , Category : Devotional, Views : 1223 ( id : 17 )
Tags : vemana
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content


Link