APLatestNews.com top Banner
చిన్న మట్టి లేదా పసుపు గణపతి చాలు - భక్తి మనసులో కానీ, విగ్రహం సైజులో కాదు - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం / వీడియో మరువద్దు.

* ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య
* పూజ, కధ, అమెరికా గణేష్ ఉత్సవాలు వీడియో
* ఏక దంతము, గుంజీలు, . . . కధలు
* హరీష్ ఛలోక్తులు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మూషికం(ఎలుక) పై బుజ్జి గణపయ్య, ఆకాశ వీధిలో , మన ఇంటికి వస్తున్నారు. చిన్న మట్టి లేదా పసుపు గణపతి చాలు మనకు, ఆయనను మన ఇంటికి ఆహ్వానించడానికి. భక్తి మనసులో ఉండాలి కానీ, విగ్రహం సైజు(ఎత్తు) లో కాదు. ముందు పూజ భక్తితో పొద్దున్నే ఇంట్లో చెయ్యాలి కానీ, జనం కోసం ఆడంబరముగా రోడ్ మీద కాదు.

వినాయక చవితి ఎంతో మందికి జీవనోపాధి కలిగిస్తుంది, బొమ్మలు చేయడం, అమ్మడం, పూజలు, వ్రతాలు, ప్రసాదాలు, డప్పులు, పత్రాలు, టీవీ ల లో, పుస్తకాలు, మైక్ లు, డాన్స్లు, వ్యాపారాలు, ఊరేగింపులు, పందిళ్ళు, లైటింగ్స్, ఇంకా ఎన్నో . . .

ఈ పండగ ప్రత్యేకత ఏమిటో తెలుసా, 20 కి పైగా పత్రములతో పూజిస్తాము మట్టి గణపయ్యను. అంటే, అన్ని చెట్లు మన చుట్టుపక్కల పెరిగి ఉండాలి, అంటే ప్రక్రుతిలో పచ్చదనాన్ని ప్రోత్సహిస్తుంది. పూజ అయినాక ఉద్వాసనలో, వాటిని దగ్గర చెరువు లేదా నదిలో కలిపితే, ఆ నీరు శక్తివంతము అవుతుంది, ఆ ఆకులతో. మలినాలు తొలిగించి శుభ్రము అవుతాయి.

మట్టితో చేసిన/ వచ్చిన విగ్రహాన్ని, మరల మట్టిలో కలుపుతున్నాము. అంటే, ఆధ్యాత్మికముగా, రేపు మనమూ అంతే, మోహము లో పడి మన జీవితాన్ని ఎదుటి వారి జీవితాన్ని పాడు చెయ్యొద్దు అని చెపుతున్నది.

మీకో విచిత్రము తెలుసా, హైందవ సంస్క్రుతిలో ఏ దేవుని పూజ కైనా, మొదటగా పూజ చేసేది, మన బుజ్జి గణపతికే, పసుపు ముద్దగా చేసి. ఎందుకంటే, విఘ్నాలు రాకుండే కాపాడే గణాల నాయకుడు ఆయన.

శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

ఈ కింది పాటలతో భక్తులు ఆనందోత్సవాలతో, పండుగ జరుపు కుంటారు ఇళ్ళ దగ్గర.

1. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ల మీదికి దండుపంపు, కమ్మనీ నెయ్యియు కడుముద్ద పప్పును, బొజ్జ నిండుగ దినుచును పొరలుచును.

2. శివ శివ మూర్తివి గణనాధ, నువ్వు శివుని కుమారుడవు గణనాధ

క్లుప్తముగా కధ అందరికీ తెలుసు. పార్వతీ దేవి స్నానము చేస్తూ, పసుపు సున్ని(నలుగు) పిండితో, బాలుని చేసి కాపలాగా పెడితే, పొరపాటున శివుడు తల తీస్తే, గజాసురిని(ఏనుగు) తల అమర్చి బతికించారు. అప్పటినుండి, వినాయక చవితిగా జరుపుకుంటున్నాము.

గణపయ్యకు, తమ్ముడు కుమార స్వామికీ, గణ ఆధిపత్యం లో పోటీ జరిగింది. అందులో కుమారస్వామి ప్రపంచమంతా చుట్టివస్తే, గణపతి తల్లిదండ్రుల చుట్టూ నారాయణ మంత్రము జపిస్తూ తిరిగి, ప్రపంచమంతా తిరిగినట్లుగా భావించి, గెలిచాడు. ఇలా మనకు ఎన్నో మంచి విషయాలు తెలియచేస్తుంది ఈ పండుగ.

ఆ రోజున, చంద్రుడిని చూడకూడదు. గతంలో క్రిష్ణయ్య కు ఇలాగే చూసి, శమంతకమణి దొంగిలించినట్లుగా నీలాపనిందలు వచ్చాయి. అందుకే, పూజ చేసి, ఆ కధ విని, అక్షింతలు నెత్తిన జల్లు కుంటే, ఆ దోషము ఉండదు అంటారు.

గణపతికి ఒక దంతము విరిగి ఉంటుంది, గమనించారా? దంతము ని విరిచి, రాక్షసుని మీద కు ప్రయోగించారు అని ఒక కధ ఉంది. మహాభారతాన్ని వ్రాయడానికి వాడారు అని కూడా అంటారు.

గణపయ్య ముందు గుంజిళ్ళు తీస్తారు తెలుసా? చూడటానికి వెళ్ళినప్పుడు, విష్ణుమూర్తి సుదర్సన చక్రాన్ని వినాయకుడు మింగితే , అల్లుడి నోట్లోనుంచి ఎలా తేవాలి బయటకు అని ఆలోచన చేసి, గుంజిళ్ళు తీసారంట. అది చూసి, ఏమిటి మామయ్యా అలా చేస్తున్నారు అని పక పక కడుపుబ్బ నవ్వారు అంట, అంతే చక్రము బయటకు వచ్చింది. అమ్మయ్య, అని విష్ణువు ఊపిరి పీల్చుకున్నారు అంట.

సాధారణంగా గుడులలో కొంచెము పెద్ద(5 నుంచి 7 అడుగులు) విగ్రహాలు పెట్టి, పూజలు నిర్వహించి, 9 వ రోజు నిమజ్జనం చేస్తారు మేళ తాళాలతో. దీనినే గణపతి నవరాత్రులు అంటారు.

కాని నేడు, పోటీలు పెరిగి, భక్తి తగ్గి, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి, అట్టహాసముగా ఎంతో ఖర్చు పెట్టి, జనానికి ఇబ్బంది అయినా ట్రాఫ్ఫిక్ తో, ఊరేగింపులు చేస్తున్నారు. సరే ఒకటో లేదా పదో పెద్ద విగ్రహలే కదా అనుకుంటే, మిగతావారు కూడా అన్ని చోట్ల చందాలు వసూలు చేసి, పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు బజారు కూడళ్ళలో (వీడియో లో ఎమ్యెల్యే హరీష్ గారి చలోక్తులు వినండి).

మీరంతా చేస్తే, మేము తక్కువా అని, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా, దగ్గరలో గుడి ఉన్నా కూడా, తమ కింద ఖాళీలోనో లేదా కారు పార్కింగ్ లోనో, ఒక విగ్రహాన్ని పెడుతున్నారు. అంటే, భక్తులు అంతా పైన నిద్ర పోతే, గణపతి కింద కాపలా ఉంటారు, అదే మరి కలికాలం అంటే.

మీరే ఇంత చేస్తే, మేమూ తక్కువా అని, ఇంకొందరు గణపతి రూపాలనే డాక్టర్ గా, యాక్టర్ గా మారుస్తున్నారు. అది చాలా తప్పు, మన తాత ముత్తాత కు ఈ వేషాలు వేస్తే, మనము ఆదరిస్తామా లేక కోపముతో అవమానిస్తున్నరు అని మందలిస్తామా? అంటే, వారి పెద్దలను కూడా, అలా అవమానిస్తారు అనే గదా. అందుకే పిచ్చి, పది రకాలు అంటారు.

పిల్లలు ముచ్చటపడి చిన్న విగ్రహముతో, పూజ చేస్తే ఇబ్బంది లేదు. కానీ పోటీగా పెద్దలు చేస్తున్నదే బాగాలేదు.

అయితే బెదిరింపు తో లేదా బలవంతము చేసి చందాలు వసూలు చేసి, ప్రతి అపార్ట్ మెంట్ లేదా బజారు కి ఒకటి పోటీగా పెట్టి, తాగి డాన్సులు చేస్తూ, భరించలేని డీజే సంగీత గోలతో, విచిత్ర గణపతి బొమ్మలు తో, అవమానిస్తూ ఆర్భాటాలు చేస్తే బాగుంటుందా? భక్తి, పెడదారులు పడుతుంది.

గత కొద్దికాలముగా, అమెరికాలో కూడా పెద్ద విగ్రహాలు పెట్టి, వ్యాపార సందడి బాగా చేస్తున్నారు, ఆట పాటలతో.

భక్తి తో సాంప్రదాయం ని ఎవరూ వద్దు అనరు. దాన్ని గొప్ప కో , పోటీకో, తమ అవసరం కో, మితి మీరి మాత్రమే వద్దు అంటారు.
 
చిన్న మట్టి లేదా పసుపు గణపతి చాలు - భక్తి మనసులో కానీ, విగ్రహం సైజులో కాదు - Pic 2
చిత్రము 2









Dt : 29-Aug-2019, Upd Dt : 29-Aug-2019 , Category : Devotional
Views : 546 ( + More Social Media views ) ( id : 157 )
Tags : ganesh chaturdhi , vinayaka chaviti

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content