APLatestNews.com top Banner
         
గ్రీన్ టీ బదులు, వంట ఇంటి దినుసుల తో తాజా టీ - ఆరోగ్యం ఆహ్లాదం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఉదయం గ్రీన్ టీ మానేస్తున్నాము. గ్రీన్ టీ కొందరు మంచిది అంటారు, కొందరు కాదు అంటారు. సరే ఏది ఎమైనా, ఖర్చు మాత్రం ఎక్కువే. అంత ఖర్చు పెట్టినా, తాజా తనం ఉండటం లేదు. మనకు దొరికే బ్రాండ్ లలో కల్తీలు తెలీదు.

మన వంట ఇంటి దినుసుల తో నే, టీ పెట్టుకుంటే నయమేమో. చాలా మంది ఇవి ఆల్రేడి చేస్తూనే ఉంటారు. దీనికి పేరు, మీరే పెట్టండి.

వేడి గా ఉన్న నీళ్ల లో, చిటికెడు పసుపు, యాలుక, లవంగా, చిటికెడు మిరియం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిన్న అల్లం ముక్క. ఇవి కాచేటప్పుడు వేసినా ఇబ్బంది లేదు. చివర నిమ్మ రసం కలపడం మాత్రం మరువద్దు, ఇదే అసలు రుచిని మార్చేస్తుంది మరి.

దగ్గర దగ్గరగా మోడరన్ కషాయం అనవచ్చేమో మరి, ఆరోగ్యానికి రక్ష, కొవ్వుకు శిక్ష.

తక్కువ ఖర్చు తో, తక్కువ కల్తీ తో, మంచి తాజా తనం. ఇది ఆరోగ్యానికి మంచిది, కొవ్వును కరగ తీస్తుంది. రోజు తాజా అల్లం ముక్క నమలడం ఎంతో మంచిది కూడా. కాబట్టి ఈ టీ కి కర్త కర్మ క్రియ మనమే కదా మరి.

ఆహా ఏమి రుచి, తాగరా మైమరచి, కడుపులో కొవ్వు కరగంగా, ఉత్సాహం పెరగంగ. డబ్బు ఇబ్బంది లేకుంటే తేనె అరస్పూన్ కలపొచ్చు. మరి ఒకసారి ప్రయత్నిస్తారా? నష్టమేముంది, వంట ఇంట్లో వస్తువులే గదా!

టీ కలిపాక, పక్కన బొమ్మలో లాగా లేదు అనుకోవద్దు, ఇది ఉదాహరణ బొమ్మ మాత్రమే. ముందు కొంచెము వేడి చేస్తుంది, కానీ మన పొట్టలో ఉన్న కొవ్వు కరగాలి అంటే మరి ఈ మాత్రం వేడి ఉండాలి కదా. సన్న గా ఉన్నవారికి కూడా, చలాకీ గా ఉండటానికి పనికొస్తుంది.
 
Dt : 25-Aug-2019, Upd Dt : 13-Aug-2019 , Category : General, Views : 94 ( id : 155 )
Tags : green tea , ginger pepper cardamon turmeric cinnamon tea

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content