APLatestNews.com top Banner
         
దేవతలకు ఇరుకైన ఆలయము, మనుషులకు విశాలమైన విడి బంగళాలు - భక్తుడి ఆవేదన - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
గోపి అప్పుడే ఇండియా నుంచి అమెరికా వచ్చాడు మొదటి ఉద్యోగానికి. వీసాలు చాలా కష్టముగా ఉన్నా కూడా, తనకి రావడం అద్రుష్టముగా భావించి, తల్లి చెప్పిన విధముగా, దగ్గర లో ఉన్న గుడికి, శనివారము వెళదాము అనుకున్నాడు.

గొపీ వాళ్ళ నాన్న, ముగ్గురు అన్నదమ్ములకు కూడా, మూడు సొంత డాబాలు కొనిచ్చాడు, ఆస్తిగా ఒక్కొక్కరికి ఐదు సెంట్లలో. ఒకే చోట ఉంటే తగువులు పడతారు అని, అంతే గాక సొంత ఇల్లు స్టేటస్ సింబల్ కూడా కదా.

తన స్నేహితుడు సాంబ ని అడిగాడు, రేపు శని వారము, నన్ను ముందు వెంకయ్య ఆలయానికి తీసుకుని వెళ్ళు. ఆ తర్వాత శివాలయమునకు తీసుకుని వెళ్ళు. ఆ తర్వాత మిగతా, గుడులకు వెళదాము అన్నాడు.

సాంబ నవ్వి, ఇక్కడ అలా ఉండదు, అన్ని ఒకే చోట ఉంటాయి. అదేమంటే భక్తుల సౌలభ్యం కోసము ఇలా పెట్టాము అంటారు. పూర్తి వ్యాపారమయము అయిపోయినది. షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా మందిరాలు పెట్టేసాము.

వెంకన్న కోసము వచ్చిన భక్తుడు, శివయ్య కోసము వేరే చోటికి వెళ్ళకూడదు. మన గుడికి వచ్చే ఆదాయం, వేరే గుడికి ఎందుకు పోవాలి. నిజమా వింతగా ఉందే అనుకున్నాడు.

శని వారము రానే వచ్చింది, ఇద్దరూ కలసి వెళ్ళారు. సాంబ గోపీని గుడి ముందు వదలి, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు తిరిగిరా అన్నాడు.

గుడిలోకి అడుగుపెట్టిన గోపి, ఆశ్చర్యపోయాడు అక్కడ కొలువు దీరిన దేవతా విగ్రహాలను చూసి. ఒకే హాల్ లో అందరు దేవుళ్ళు, శివయ్య, రామయ్య, హనుమయ్య, క్రిష్ణయ్య, బాబా, . . . చిన్న చిన్న టిక్కీలుగా/అలమర గదులుగా పెట్టి ఉన్నారు.

అయ్యో ఏమిటీ వింత, నేను కనీసము హైదరాబాద్ లో సంఘీ దేవాలయము లాగా, చిన్న చిన్న విడి గుడులు ఉంటాయి అనుకున్నాను. ప్రతి చిన్న గుడికి, ఒక పూజారి, తలుపు, తాళం ఉంటాయి అనుకున్నాను. ఇదేమిటి అందరినీ ఒకే గదిలో బంధించి, మొత్తానికి ఒకే ద్వారము, తాళము పెట్టారు అని బాధపడ్డాడు.

మన ఇంట్లోనే, ముగ్గురు పిల్లలు ఉంటే, అందరికీ తలోక రూం ఇచ్చి ఉండమంటామే ప్రైవసి(ఒంటరితనం) కావాలి అని. అన్నదమ్ములు ఒక చోట ఉండలేక ఇమడలేక, విడి విడి గా డాబాలు / అపార్ట్మెంట్ లు కొంటారే. మరి దేవుళ్ళ దగ్గర ఈ ఇరికించడము ఏమిటి, వారికీ మన లాగా కనీసం విడి విడి గదులు / ఇళ్ళు వద్దా?

సరే, కలి కాలము ఏమి చేస్తాము అని, దేవుళ్ళందరికీ నమస్కారము చేసి, క్షమాపణలు చెప్పి సాంబ రాగానే, ఇద్దరూ ఇంటికి వెళ్ళారు.

దేవతలు మాత్రం ఒకే గుడిలో ఐకమత్యముగా ఉండాలి, వారిని కొలిచే భక్తులు మాత్రం తమ సొంత తల్లి దండ్రులు, అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళ తో మాత్రం కలసి ఉండరు.


Dt : 10-Aug-2019, Upd Dt : 10-Aug-2019 , Category : General, Views : 71 ( id : 152 )
Tags : temple , god idol , multiple idol in same hall
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content