APLatestNews.com top Banner
         
సీసపు స్థాయి - కాటుక , కుంకుమ, పసుపు, బంగారు గాజులు - పసి పిల్లల జాగ్రత్తలు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
సీసపు స్థాయి పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి అని అందరికి తెలుసు. పెయింట్, నీరు మరియు మట్టి లో ఇవి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తాగు నీరు లో కూడా వీటి స్థాయి చెక్ చేసి పరిశుభ్రం చేస్తారు. ముఖ్యముగా, పిల్లల అభివృద్ధి చెందుతున్న నాడీ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది.

ఈ మధ్యలో ఒక పేపర్లో చదివానట్టు గుర్తు. కాటుక , కుంకుమ బొట్టు, పసుపు, బంగారు గాజుల వల్ల, ఒకరు లేదా ఇద్దరు చిన్న పిల్లకు ఇక్కడ సీసపు స్థాయి పెరిగింది అని, అది కూడా నోటి ద్వారా. దానికి వారు, ఇక్కడ షాప్ నుంచి తెచ్చి వేరేవి వాడితే(బొట్టు బిళ్ళ మరియు ప్లాస్టిక్ గాజులో మరి వేరే గాజు లో), సీసపు స్థాయి తగ్గింది అని, జాగ్రత్త పడమని సారాంశము.

జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే చిన్న పిల్లల విషయములో. మరి అసలు 2 లేదా 3 ఏళ్ళ పిల్లకు అన్నములో పసుపు వేసి పెడతామా? వినలేదు. ఒకవేళ పెడితే ఎన్నిసార్లు పెడతాము, రోజూ, వారానికి, నెలకి? ఒకవేళ సంప్రదాయం అయితే, మరి మన పెద్దలు ఆలోచన లేకుండా పెడతారా?

2 ఏళ్ళ లోపు పిల్లకి, నుదుట కుంకుమ పెడతామా? వాళ్ళు నోట్లో వేసుకోరా? బంగారు గాజులు కి పూత ఉంటుంది, మరి చిన్న పిల్లలు నోట్లో పెట్టుకోరా? పండక్కో పబ్బనికో ఒకసారి వేస్తాము అంతేనా? అసలు ఇవి గాక, ఇంకేమైనా ఇంట్లో వస్తువులు, నోటిలో పెట్టుకుంటున్నారో తెలీదు కూడా.

పాత రోజుల్లో ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, తాత, అన్నలు ఉండే వారు. అందరు పిల్లను కనిపెట్టుకుని ఉండే వారు. నోట్లో వేలు పెట్టుకున్నా, టపీ మని కొట్టి అలవాటు మానిపించేవారు.

మరి ఇప్పుడు, ఇద్దరూ ఉద్యోగాలు. ఒక వేళ ఇంట్లో ఉన్నా, పనులు, ఇతరులతో మాటలు, ఫొన్ లో చాట్ లు, వాట్సాప్ లు, ఇంకా ఎన్నో బిజీ పనులు. పిల్లల చేతికి కూడా ఫోన్ లు, ప్లాస్టిక్ వస్తువులు,వివిధ రకాల వస్తువులు చాలా దొరుకుతున్నాయి. కంటికి రెప్పలా చూసుకునే వారు లేరు.

మన సాంప్రదాయ పద్దతి వలన లెడ్ స్థాయి పెరుగుతుంది అని అపోహ కావచ్చు. మితం గా
వాడుక వలన, ఎలాంటి నష్టం ఉండకపోవచ్చు. అలాంటి ఇబ్బంది ఉన్నవి, ఎన్నో వాడుతున్నాము. అందుకే పసి పిల్లల ను ప్రతిక్షణం కనిపెట్టుకుని ఉండాలి.

ఒకవేళ మనం కొనే కాటుక , తిలకం బొట్టు, కుంకుమ, పసుపు కల్తీ ది కావొచ్చు. కల్తీ లేనివి, ముత్తాతమ్మల కాలం దగ్గర నుంచి కాటుక వాడారు కదా.

సగం మంది చాదస్తం అనో, అనవసరం అనో, ఇంకా ఇక్కడ కూడా నా అనో, ఆల్రెడీ మానేశారు. ఇలాంటివి చూస్తే, భయం కన్న బద్దకంతో, ఎక్కువగా దూరంగా ఉంటారు.

మరి కోక్, పిజ్జా, ఐస్క్రీం, బర్గర్, బయట తిండ్లు ప్రమాదం అని మానేసామా? ఇది అంతే.

హాయిగా బొగ్గు తో, ఉప్పు తో , వేప పుల్ల తో పళ్ళు తోముకునే మనల్ని భయపెట్టి, రసాయనాల పేస్ట్ తో పళ్లు తోమిస్తున్నారు. మరలా ఇప్పుడు తిరిగి, టూత్ పేస్ట్ ప్రకటన లో, మీ పేస్ట్ లో బోగ్గు ఉందా , ఉప్పు ఉందా , మట్టి ఉందా మశానం ఉందా అని అడుగుతున్నారు.

అంటే అర్ధం ఏమిటి. 30 ఏళ్ల క్రితం మాన్పించాము. ఇప్పుడు వ్యాపారం పోటీ తట్టుకోలేక, మరలా మీ పాత సాంప్రదాయం ను వాడతున్నాము అనేగా?

అంతా కల్తీ మయం , వ్యాపార సామ్రాజ్యం పోకడలు. ఒకవేళ చిన్న ప్రమాదం ఉన్నా , దానిని భూతద్దంలో చూపించడం, భయపెట్టడం - జాగ్రత్త గా ఉండాలి అని గీత, సావిత్రితో చెప్పింది. అలాగే అక్కా, నొట్లో వస్తువులు పెట్టుకోకుండా చూస్తే చాలు, వెయ్యడం వల్ల ప్రమాదం లేదు, వాళ్ళు చెప్పింది అదే కదా. జాగ్రత్త గా ఉందాము అంది.

Dt : 08-Aug-2019, Upd Dt : 08-Aug-2019 , Category : General, Views : 108 ( id : 151 )
Tags : lead level , kids , kumkum , gold bangles , turmeric , kajal
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content