Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.
వెంకా ఏందిరా , గ్రామ వాలంటీర్లు అందరూ వాళ్ళ అనుచరులు లే అంట గదా. మరి మన పచ్చ దళానికి ఒకటో రెండో నంటగా, అన్యాయం కదూ, మన నోట్లో మట్టిగొడుతున్నారు.
అదేంది వీరా , మొన్న 10 ఏళ్లు మన జన్మ భూమి కమిటీ ల్లో పచ్చ(పసుపు) దనమే గదా ఏలింది. ఏడిస్తే ఎట్టా, వీళ్ళు కొన్నేళ్లు తిననీయ్. కళ్లు మూసుకుని, ఇప్పుడు దాకా సంపాదించిన దానితో, ఎంజాయ్ చెయ్యి. గట్టిగా అంటే, మన గత నలుపు తవ్వి చూపిస్తారు.
నిజమే వెంకా మరి, మనము మనము మాత్రం బయటకు కొట్టుకోకూడదు. కానీ అలవాటు అయిన చెయ్యి కదా. సరే మనం కొంత కాలం, వాళ్లు కొంత కాలం ఇలా తింటుంటే, మరి మిగతా వాళ్ళు ఏడవరా.
ఒరే వీరా , మిగతా వాళ్లకు అంత తెలివే ఏడిస్తే, మన ఇద్దరు నే మార్చి మార్చి ఎన్నుకుంటారా? కొత్త వాడికి అవకాశం ఎప్పుడో ఇచ్చే వారు.
మిగతా వారికి ముక్క, చుక్క తో పచ్చ నోటు చాలు ఎలచ్చనప్పుడు. బిగ్ బాస్, సీరియల్స్, సినిమా లు చూసుకుంటూ,ఉళ్ళో తగవులు, ఇళ్ళ పక్క తగువులు తో, ఐదేళ్లు గడిపేస్తారు. అసలు ఓటే వేయని ముఠా ఇంకోటి. ఊరు భక్తి, రాష్ట్ర భక్తి ఏడిస్తే కదా, వాళ్ళ స్వార్దం వాళ్ళది, మన స్వార్ధం మనది.
ఈళ్ళు ఇలా బాధ్యత లేకుండా మత్తులో ఉన్నంతకాలం, మన మనవళ్లే నాయకులు, వీళ్ల మనమలే కార్యకర్తలు.
వాళ్ళకు బాధ్యత ఏడిస్తే, సొంత ఊళ్ళో ప్రభుత్వ దవాఖానా లేదా ఇస్కూల్ సరిగ్గా లేవు అని ధర్నాలు చేసారా? ఇకనైనా చేస్తారా? అది జరగని పని. అందుకే, మనమే నాయకులము.
సరే పద, మన ముఠా ను మరియు జనాన్ని ఎగదోయాలి పైపైన ముసలి కన్నీరు తో. మనకు మన రాష్ట్రం కి ఏదో జరిగి పోతుంది అని, ఇప్పుడు గెలిచిన నాయకులు తో.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2092 General Articles and views 1,837,122; 104 తత్వాలు (Tatvaalu) and views 221,573
Dt : 06-Aug-2019, Upd Dt : 06-Aug-2019, Category : Politics
Views : 1213
( + More Social Media views ), Id : 149
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Grama Volunteer ,
Janmabhoomi Committee
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments