స్నేహితుల దినోత్సవం - మంచి స్నేహితులు అంతస్థులు చూడరు, అది వారి గొప్పతనం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,868; 104 తత్వాలు (Tatvaalu) and views 224,921.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనకు రిక్షా తొక్కే వారి నుంచి, పెద్ద నగరాలలో విదేశాలలో కోటీశ్వరులైన కంపెనీ యజమాని లాంటి స్నేహితులు ఉన్నారు. అందరితో ఒకే విధమైన పలుకరింపు గౌరవము, ఒకే విధమైన మందలింపు జాగ్రత్తలు, దానిలో ఏనాటికీ మార్పు రాదు.

ముంబై వారు గురించి ఈ వివరణ. ఎప్పుడూ మా మధ్య డబ్బు, వ్యాపారం, అధికారం గురించి మాటలు రావు. కేవలం మంచి చెడు గురించి మాత్రమే. వారి స్వవిషయాలు చెప్పి, మంచా చెడా అడుగుతారు. వారిది హిందీ, కానీ ఇంగ్లీషు లోనే మాట్లాడుతాం.

వారు అంటారు, మాకు మంత్రులు తెలుసు, చాలా మంది ఉద్యోగం చేస్తున్నారు. మీరు ఇక్కడకు వస్తే, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం, కానీ రారు. వచ్చి, మీ హాబీ, హయిగా ఫోటోలు తీసుకుని వెళ్ళండి అంటారు. వారికి విదేశాల్లో కంపెనీలు బ్రాంచీలు ఉన్నాయి.

ఒక్క రోజు కూడా పొగడరే, ఎప్పుడూ తప్పులు చెపుతూ ఎత్తి చూపుతూ, ఎంత మాట పడితే అంత మాట అనేస్తారు, మీ ఊళ్ళో చిన్నప్పటి స్నేహితులు లాగా, అంటారు చిరు కోపంగా నవ్వుతూ.

అప్పుడు వాళ్ళ తో అన్నాను, మీ చుట్టూ 999 మంది అవసరానికి అవకాశానికి, పొగిడే వాళ్లు ఎటూ ఉన్నారు. నా అవసరం లేదు, మీకు ఆ విషయంలో. మీరు ఎప్పుడూ ఆ స్ధాయి లో ఉండాలి కింద పడిపోకుండా అంటే, నేను ఇలాగే ఉండాలి, వాస్తవం చెప్పాలి, ప్రపంచ బ్రమలను తొలగించాలి. మీకు దూరంగా ఉండాలి. మీరు ఇవన్నీ భరించాలి, అర్థం చేసుకోవాలి. నేను చెప్పినది తప్పు అయితే, కళ్ళు మూసుకొని మీరే ఆలోచన చెయ్యండి లేదా దూరంగా ఉన్నా మీ ఇష్టము అన్నాను.

ఇప్పుడు వరకు, నన్ను తిప్పి ఒక్క ఎదురు మాట అనలేదు. వారి డబ్బు లో అధికారం లో మంది మార్భలము లో, ఒక వంతు కూడా వారితో సరిపోము. అది మనకు తెలుసు. మరి ఆధ్యాత్మికం లో మనసు నియంత్రణ లో, వారూ మనకు పోటీ రాలేరు కదా? అది వారికీ తెలుసు.

ఇప్పటి కి 20 ఏళ్ళు గడిచాయి, ఇంకా గడుస్తాయి, ఎప్పుడూ కలవలేదు. బహుశా కలవం, ఎందుకంటే ఆ ఒక్క విషయం తప్ప, మిగతా మా దారులు వేరు. ఎప్పుడూ రూపాయి లేదా సహాయం అడగలేదు. అడగము, అడగకూడదు.

నమ్మకం సడల లేదు. నెట్ లో వారి ఇల్లు, పూజా గది చూపిస్తారు. గొప్ప కోసం కాదు సుమా, కేవలం అభిమానము, నమ్మకం. ఎవరు వారు, ఎవరు మనము?

ఇంకా మంచి స్నేహితులు ఉన్నారు, అంతస్థులు చూడరు. అది వారి గొప్పతనం, అంత ఉండి కూడా, ముక్కు మొఖం తెలియని, మనలాంటి వారి చేతిలో 20 ఏళ్లుగా (మంచి) మందలింపు మాటలు పడటం.

ఆ స్నేహితునితో మాట్లాడే టైం తెలుసా? నమ్ముతారా? సంవత్సరం కి రెండు, మూడు సార్లు. భారత కాలమానం ఉదయం 5 కి మొదలు మాత్రమే. అదీ వారు ఫోన్ చేస్తే. ఎందుకంటే వాళ్ళ లో ఆత్మ జ్ఞానం రగిలించే సమయం, అప్పుడు మాత్రమే, బ్రహ్మముహూర్తం సమయం. అప్పుడే, ప్రాపంచిక మోహం లో ఉన్నవారి, మనసులో బలముగా నాటుకుంటుంది. అది వారికీ చెప్పా మొదటి సంవత్సరమే, అలవాటు చేసాను. ఎదిగినా ఒదుగుతారు కాబట్టి నేర్చుకున్నారు.

కాబట్టి, విడి సమయములో వారు ఎన్ని సార్లు ఫొన్ చేసినా, మనము జవాబు ఇవ్వకపోయినా, బాధపడరు, మనకు అహంకారము అని అనుకోరు. ఒక్కోసారి కావాలని సమయ మోసానికి, వారు విదేశాల లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నావు అంటే మాత్రం, నిజం చెపుతారు, లేదు భారతం వెళ్ళిన తర్వాత, ఉదయం 5 కు మాత్రమే అంటా.

వారికి స్పష్టము గా తెలుసు, తను వద్దు అన్నాడు అంటే, దాని వెనుక మనము అరిషడ్వర్గాలను దాటడానికి, ఏదో మర్మము ఉంది అని, మన బుద్ది లక్షణాలు తనకు పూర్తిగా తెలుసు అని, అందుకే వారు బాధపడరు, ఎదురు తిట్టరు, మనల్ని వదలరు 20 ఏళ్ళు గా. ఏమి బంధం ఉంది వారితో?

అంత మనిషి కి, ఆ టైంకి లెగిచి, మనతో మాట్లాడాల్సిన, అవసరం ఉందా?

ఈ రోజుకూ కూడా, భయపడకుండా వాళ్ళ ఇంట్లో ఫోటోలు మనకు పంపుతారు, మనము పంపక పోయినా. మన విషయం వారికి చాలా వరకు తెలుసు, అమ్మ గుడి 108 ప్రదక్షిణ నేల నిద్ర శాఖాహారం లాంటివి కూడా.

ఒకరు అడిగారు, మీకు అవసరం కష్టం రాక అడగలేదు, లేకపోతే అడిగి ఉండేవారు కదా అని.

కష్టం వచ్చింది 15 ఏళ్ల ముందు, ఉద్యోగం లేక తిరిగా ఇక్కడ నుంచి వెనక్కి వచ్చి. వాళ్ళ తో చెప్పలేదు, అడగలేదు.

అలాగే, ఇప్పుడూ కష్టం లో నే ఉన్నా. వచ్చే ది సున్న, పోయేది చాలా. అయినా చెప్పము, అడగము. అంటే మన వివరాలు గోప్యమా, లేదు, మన కష్టం దాటినాక చెప్తాము, మనము ఎదుర్కొన్న ఇబ్బంది. వారి సమస్య కు పరిష్కారం లేదా తప్పొప్పులు చెప్పడం వరకే మన విధి.

అంతకు మించి ముందుకు జరిగినా లేదా చేయి చాచినా, స్వార్ధంతో మోహం లో పడ్డట్లు. ఇంక వారికి మంచి చెప్పే, స్ధానంకి స్థాయికి పనికి రాము, అర్హత కోల్పోతాము.

మోహం లో పడితే, మాధవుడు దూరం అవుతాడు. అది ఇంకా ప్రమాదం. వారి ధనము వాడితే, వారి పాపములు లో కూడా భాగము పంచుకోవాలి.

ఒకవేళ దేవుని ఆజ్ఞ, ఇంటికి వెళ్లి వెనక్కి, అద్దె తో గడుపు అంటే అదే చేద్దాం, భయమెందుకు, రాత తప్పించుకో లేము కదా. లేదు పోయినసారి దోవ చూపించా, అలాగే చూపిస్తాను అంటారేమో.

మన ప్రయత్నం శ్రమ మానకూడదు, విశ్వాసం తగ్గకూడదు. కొంతమంది, తొందరపడి జీవితాలు పాడు చేసుకుంటారు.

చీకటి తర్వాత వెలుతురే. అమ్మ ను నేను వదలను, దేవుడు మమ్మల్ని వదలడు అనుకుంటున్నా. చూద్దాం, ఏమి జరుగుతుందో.

- ఓ స్నేహితుని కధ

గుర్తు ఉందా ఈ కధనం, ముంబై స్నేహితులు గురించి? 7/31/2022

Did you remember we said about Mumbai friends? In this year, last week we had chat for 30 minutes about spiritual things.

It is happening from more than 10 years. Do you know at what time they will call?

Even they have wealth, companies, many more, they will still follow the timing and respect. They will agree their mistakes darely, they know how much difficult to control mind.

No argument, only listen and share spiritual progress. All telugu/ english combination and Sanskrit writing or speech songs, they are also receiving from years from us like you.

Can you find the time from article? Are you able to wake up at that time if you have that much capacity/ position? When our position is increasing, we have to be humble that much. So please start today sadhana, for breaking of slavery of Arishadvarg and ashta vyasan. Tomorrow is not ours.

ఈ సంవత్సరం కు, గత వారంలో ఓ అరగంట, ఆధ్యాత్మిక ముచ్చట్లు ఆంగ్లంలో, సమయం తెలుసు కదా?

వాళ్ళు కు ఎంత హోదా అధికారం ఐశ్వర్యం ఉన్నా కూడా, మనము చెప్పిన ఆ సమయం అప్పుడు మాత్రమే ఎప్పుడూ, వినయం గా వారే ఫోన్ చేసి మాట్లాడతారు. ఆ సమయం దాటితే, ఫోన్ జవాబు ఉండదు అని వారికి స్పష్టం.

నియమాలను దాటరు, ఎదురు చెప్పరు. ఎందుకంటే మనసు నియంత్రణ సాధన ఎంత కష్టమో వారికి తెలుసు. మీరు అందుకునే, తెలుగు ఇంగ్లీష్ సంస్కృతం ఉన్న మాటలు గొంతు వారూ ఏళ్ళు గా అందుకుంటున్నారు.

ఆ సమయానికి మీరు లెగవగలరా, ఆ స్ధితిలో హోదాలో ఉంటే? ఆ సమయం చెప్పండి, చదివి? వారి గురించి కూడా తెలుసుకోండి. ఎదిగే కొద్దీ ఒదగాలి.

ఎంత ఎత్తు కు ఎదిగినా, చివరకు పంచభూతాలు కు తలవంచాలి, అరిషడ్ వర్గాల కు అష్ట వ్యసనాలకు సాధనతో దూరంగా ఉండాలి.

అంటే మానసిక బలం ఉండాలి, అంటే మనము చెబుతున్న సాధనలు ఆచరణలో పెట్టాలి కదా, ఏనాటికైనా.

రోగాలు వచ్చిన తర్వాత, శరీరం చచ్చు బడినాక, వయస్సు ఉడిగినాక, సాధన ధ్యానం చేయలేము. ఇప్పుడే మొదలు పెట్టగలరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,868; 104 తత్వాలు (Tatvaalu) and views 224,921
Dt : 04-Aug-2019, Upd Dt : 31-Jul-2022, Category : General
Views : 3122 ( + More Social Media views ), Id : 146 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : friendship day , true friendship , Bombay , Mumbai , company
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content