APLatestNews.com top Banner
         
వరలక్ష్మీ వ్రతం 3 కుటుంబాలు పొద్దున్నే 5 గంటలకు ఆచరించారు, మీరు ప్రయత్నిస్తారా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
వరలక్ష్మీ వ్రతం, ఈ సంవత్సరం ఆగస్ట్ 9, శుక్రవారం వచ్చింది. మీ ప్రాంత కాలెండర్ చూడండి, సరియైన తేదీ కోసం.

2012 లో జులై ఆగస్ట్ లో వచ్చింది శ్రావణ మాసం. అప్పుడు దేశ రాజధాని డీసీ కి, గంట దూరం లో ఉత్తరంగా ఉన్నాము. దగ్గర ఇళ్ళ వాళ్ళము అందరం కూర్చొని, వరలక్ష్మీ వ్రతం మనకి ఉన్నంతలో , సంప్రదాయబద్దం గా పద్ధతిగా, ఎలా చేయాలి అని చర్చించుకున్నాము.

మొత్తము ముగ్గురు దంపతులు, ఆంధ్ర, తెలంగాణా మరియు రాయలసీమ నుండి ఒక్కొక్కరు. అందులో ఒక జంట, పెద్ద వారు. మంచి మనుషులు, మంచి మనసులు, మంచి సంకల్పము, ఇంక ఎదురేముంది, దైవం అండ ఎప్పుడూ ఉంటుంది మరి.

నాలుగు వారాలు చెయ్యాలి, ఒక్కొక్క ఇంట్లో. ఒకరు నోటితో మంత్రాలు చదవాలి, మిగతా వారూ పుస్తకం చూసి, తప్పకుండా పలికే ప్రయత్నం చేయాలి. అంటే, మనసు కళ్ళు మాట చెవులు ఒకే దాని పై నిమగ్నము అవ్వాలి.

ఆడియో(mp3) వాడ కూడదు. అందరూ పనులు పంచుకోవాలి, పూలు, అలంకరణ, కొంచెం వంట, కొంచెం ప్రసాదం, అలాగే మిగతావి.

పూజారిని బయట నుంచి తీసుకుని రావాలి అంటే, దక్షిణ తో పాటు తెచ్చి మరలా దింపాలి లేదా దానికి కలిపి ఇవ్వాలి. ఏదో తక్కువలో 4 గురిని పిలుచుకొనేటప్పుడు, అది అంతా కష్టము. ఒక్కోసారి, గుడి దగ్గరలో కూడా ఉండదు. ఒకవేళ ఖర్చు పెట్టగలిగినా, సమయము కలవదు. అది కూడా వ్యాపారం అయిపోయింది.

మన బాధ్యత మంత్రాలు మరియు తంతు సక్రమంగా జరిపించడం. అది జరిగినంత సేపు అందరూ క్రమశిక్షణ గా, పూజ ధ్యాస లోనే ఉండాలి, కబుర్లు మరియు ఫోన్ లు లేకుండా. అందరూ అంగీకరించారు. భౌతిక నైవెద్యము కన్నా, ఏకాగ్రత శ్రధ్ధ తో కూడిన మానసిక నైవేద్యం మిన్న అని అనుకున్నాము.

అలా ఒక్కొక్క వారము, ఒక్కొక్క ఇంట్లో, ఆ ఇంటి యజమాని కర్త గా, పూజ చేసుకుంటూ పోవాలి. మొదటి మరియు 4 వ వారం(Aug 4th, 2012), పెద్ద జంట ఇంట్లో పూజ.

4 వ వారం మాత్రం, పొద్దున్నే 4 am నుంచి 5 am లోపల మొదలు పెట్టాలి అని, అందరం నిర్ణయించుకున్నాము. ఎందుకంటే, బ్రహ్మ ముహూర్తం లో ని పూజ, ఎక్కువ ఫలితం. మనకు కూడా, వేరే ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతము గా ఉంటుంది. పెద్దావిడకు ఇలాంటి భక్తి కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం, అబ్బాయి, మాదేమి లేదు, పొద్దున్నే 3 గంటలకు అయినా ఓకే అంటారు. మిగతా ఇద్దరూ ఉత్సహవంతులు, శని వారం పొద్దున్నే, అందరూ ఓకే.

అలా ఎవరి శక్తి కొలది, వారు ప్రసాదాలు తయారు చేసుకొని, ఒక్కొక్కరి ఇంట్లో పూజ పద్దతి ప్రకారం చేసుకుంటూ, మూడు వారాలు గడిచాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి వారం, అందరు ముందు అనుకున్నట్టుగా సహకరించుకున్నారు.

4 వ వారం పొద్దున్నే 4 am నుంచే అందరు రెడీ అయ్యి, పెద్ద జంట ఇంటికి వెళ్ళి, 5 గంటలకల్లా పూజ మొదలు పెట్టాము. వారు రాత్రి కూడా చాలా సమయం వరకు, ఏదో ఒకటి ప్రసాదము తయారు చేస్తున్నారు. మరలా, పొద్దునే లెగిచి అంతా సిద్ధం చేసారు.

ప్రతి పూజా కనీసం షుమారుగా 2 గంటలు పట్టింది కధ తో కలిపి. అందరూ చదవాల్సిందే, బుద్దిగా మనసును దైవం పై కేంద్రీకరించి.

అలా అందరమూ పట్టుదలగా, సహకరించుకోని, సర్దుబాటు చేసుకొని, మేమూ పొద్దున్నే లెగిచి, సొంతముగా పూజ చేయగలము, మంత్రాలు చదవగలము అని నిరూపించుకున్నాము. వాయనాలు పంచుకున్నారు. వారు దక్షిణ ఇస్తే, గుడి హుండీ లో సమర్పించాము.

తర్వాత, దీని వలన నే అని చెప్పలేము గానీ, అందరికీ మంచే జరిగింది. ఎవరి జన్మ సుక్రుతాన్ని బట్టి, వారికి కలిసే వచ్చింది. సంతానం, పచ్చ కార్డు, ఇళ్ళు , . . . మరి మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదా, దైవ సహాయం కోసం.

పూజా విధానం మీకు తెలుసు కాబట్టి, ఇక్కడ చెప్పడం లేదు. మనసు నిర్మలత్వం, ఏకాగ్రత, ద్యాస ముఖ్యం ఏ పూజకైనా.

లేదంటే భోజనాలకో లేదా పలహారానికో, కబుర్లతో నలుగురు కలిసినట్టు గా ఫంక్షన్ అవుతుంది , ఫలితం శూన్యం. నోరు కదపకుండా, ఆడియో తో మమ అనిపించినా, ఫలితం ఉండదు. శింగడు అద్దంకి పోనూ పొయ్యాడు, రాను వచ్చాడు అనే సామెత ఉంది తెలుసు కదా, ఉపయోగం లేదు అని చెప్పడానికి.

చాలా మంది అంటారు, మంత్రాలు కష్టము అని. తప్పు, మన మనసు సిద్దంగా లేదు అనండి, జగన్మాత కోసం అంత సమయం కేటాయించలేను అనండి. తప్పులేదు మీ ఇష్టం. ఎందుకంటే, అమెరికాకు కష్ట పడకుండా వచ్చామా? డిగ్రీ ఊరికే వచ్చిందా? పిల్లల్ని కష్టం లేకుండా కన్నారా, పెంచారా?

కనీసం ఒక్కసారి అయినా పొద్దున్నే 5 గంటలకు పూజ మొదలు పెట్టండి, వీలైతే మరి, మీరూ ప్రయత్నించండి, మీ స్నేహితులు బంధువులతో.

అబ్బా అంత పొద్దున్నే మా వాళ్ళు స్నేహితులు రారు మేం చెయ్యం. మా వాళ్లు పార్టీలు ఫక్షన్ కు మాత్రమే 10 am తర్వాత వస్తారు అంటారా? సరే, మనల్నిబట్టే , మన స్నేహితులు. దాని బట్టే, మనకు ఫలితము. ఎవరూ రారు, మనం ఒక్కరమే చేసుకుందాము తర్వాత ప్రసాదం పెడదాము, తప్పేంటి.

కన్న తల్లులు , మీరంతా ఆరోగ్యం గా హయిగా ఉండాలి. మరి ఇలాంటి వి అందుకే మన పెద్దలు పెట్టారు, మరచిపోతున్నాము. రోగాలు, బరువు, లావు , హస్పిటల్, కష్టాలు, కన్నీళ్ళు . . .ఇంకా పెరుగుతున్నవి.

వరలక్ష్మీ వ్రతం 3 కుటుంబాలు పొద్దున్నే 5 గంటలకు ఆచరించారు, మీరు ప్రయత్నిస్తారా? - Pic 2Dt : 30-Jul-2019, Upd Dt : 30-Jul-2019 , Category : America, Views : 170 ( id : 142 )
Tags : varalakshmi vratam , early morning 5 am , 3 families , varalakshmi puja , sravana masam
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content