APLatestNews.com top Banner
         
ఆధ్యాత్మికమైన ఆరోగ్యకరమైన ఛాలెంజ్, ఒక్కటైనా చేయగలరేమో ఒకసారి ప్రయత్నించండి - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఫ్రెండ్స్ తో షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఆధ్యాత్మికమైన ఆరోగ్యకరమైన ఛాలెంజ్(సవాలు) - మీరు చేయగలరేమో కనీసం ఒకసారి ప్రయత్నించండి. ఇవి చేస్తున్నప్పుడు, ఎటువంటి వేరే ఆలోచనలు చేయరాదు.

మనము ఎన్నో ఛాలెంజ్ లు చూసాము, చేయటానికి ప్రయత్నించాము కష్టమైనా. ఉదాహరణకు, ఐస్ బక్కెట్ ఛాలెంజ్, సీసా మూత కాలి వేలి తో తీసే ఛాలెంజ్, ఇంకా ఎన్నో, . . .

ఈ క్రింద చెప్పినవి, మన పూర్వీకులు చేసారు. మేము చేసాము. మరి మీరు, మీ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారా?

1. కరమాల జపం ఛాలెంజ్- చేతి వేళ్ళ భాగాలను లెక్కపెడుతు, 108 సార్లు మీకిష్టమైన మంత్రం(రామ, ఓం నమో నారాయణ, ఓం నమశ్శివాయా, . . .) జపించాలి, కళ్ళు మూసుకొని, మీ ఇష్ట దేవతను స్మరిస్తు. మధ్యలో ఆపకూడదు, కళ్ళు తెరవకూడదు. అది కుదరని వారు, జపమాలతో చెయ్యవచ్చు. షుమారు 15 నిమిషాలు లోపు పడుతుంది. ఇది చాలా తేలిక, ఎవరైనా చెయ్యవచ్చు. కనీసం 2 సార్లు, అంటే 30 నిమిషాలు.

ఉపయోగాలు : వేళ్ళ నుండి మిగతా భాగాలకు రక్త ప్రసరణ, బీపి షుగర్ అదుపు, ఏకాగ్రత, ఆలోచన, ఆధ్యాత్మికం

2. ప్రశాంతంగా కూర్చునే ఛాలెంజ్ - కళ్ళు/నోరు మూసుకుని అరగంట కూర్చోవాలి. ప్రశాంతమైన మన ఇంటి లోపల, పూజా గది లో, పద్మాసనము తో వీలైతే, కాకపోతే కింద లేదా కుర్చీలో. ఒక రకంగా ధ్యానం లాంటిది. మీకిష్టమైన మంత్రం జపిస్తూ, మీ ఇష్ట దేవతను స్మరిస్తు. ఇది చాలా తేలిక, ఎవరైనా చెయ్యవచ్చు.
ఉపయోగాలు : బీపి షుగర్ అదుపు, ఏకాగ్రత, ఆలోచన, ఆధ్యాత్మికం

3. ప్రదక్షణ ఛాలెంజ్- ఒక చిన్న దేవాలయం(నాలుగు గదుల వైశాల్యము) చుట్టూ 108 ప్రదక్షణాలు సవ్య దిశలో, మీకిష్టమైన మంత్రం జపిస్తూ, మీ ఇష్ట దేవతను స్మరిస్తు. మధ్యలో ఆపకూడదు. నడివయసు వారికి 1 గంట పడుతుంది, మిగతా వారికి 45 నిమిషాలు నుండి 3 గంటలు పట్టవచ్చు. మీ శరీర ఓపికను బట్టి మాత్రమే చెయ్యాలి. కరమాలతో లెక్కించవచ్చు.

ఉపయోగాలు : కాళ్ళకు మంచి రక్త ప్రసరణ, నడక వ్యాయామం, బీపి షుగర్ అదుపు, ఏకాగ్రత, ఆలోచన, ఆధ్యాత్మికం

ఇంకా చేయదలుచుకుంటే, చాలా ఉన్నాయి :

1. నేల నిద్ర ఛాలెంజ్- 40 దాటాక ఎటూ డాక్టర్ పడుకోమంటే ఎటూ పడుకుంటున్నాము. మాల వేసుకున్న భక్తులు, కింద పడుకుంటారు. మనకు చాప దిండు ఉన్నా పర్లేదు. ఒళ్ళు గట్టి పడుతుంది. కీళ్ళు అన్నీ పనిచేస్తాయి.

2. శాఖాహార ఛాలెంజ్ - మాంసము ముట్టను నెల రోజులు. 40 దాటాక జీర్ణ వ్యధులతో, ఎటూ డాక్టర్ వద్దు అంటే మానుతున్నాము. హోటల్ లో, కుళ్ళిన మాంసం మసాలాతో దట్టించి ఇస్తే తింటున్నాము. ఆరోగ్యానికి మనసుకు శాఖాహారము మంచిది.

3. ఇంటి భోజనము ఛాలెంజ్ -ఒక నెల బయట తిండి తినను అనుకోండి. డబ్బులు మిగులుతాయి, రోగాలు తగ్గుతాయి. ఆరోగ్యానికి మనసుకు శాఖాహారము మంచిది.

4. రామకోటి ఛాలెంజ్ - రోజుకు ఒకటి లేదా అర పేజి. ఏకాగ్రత, మనసుకు ప్రశాంతము.

We are hearing so many other challenges. we can also try a Healthy Devotional Challenge for our self.

1. Kara maala japam challenge - try to count the finger segments till 108 by chanting any liked mantra. If this count is difficult, you can use japamaala.
2. Meditation challenge - sit in padmaasan if possible, close the eyes, be calm for at least 30 min.
3. Pradakshan challenge - try to do 108 pradakshan in a small temple by chanting and thinking about liked God.

Benefits : nerves active, healthy, exercise, BP and sugar control, concentration, positive thinking, devotional, mental peace

Dt : 09-Jul-2019, Upd Dt : 09-Jul-2019 , Category : Health, Views : 232 ( id : 135 )
Tags : pradakshan challenge , meditation challenge , japa challenge , sleeping on floor , vegetarian food , ramkoti
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content